KL Rahul Century In Test: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో మెరిశాడు. ప్రొటీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 219 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్న రాహుల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండడం విశేషం. బాక్సింగ్ డే రోజున(డిసెంబర్ 26) సెంచరీ మార్క్ అందుకున్న కేఎల్ రాహుల్‌కు టెస్టుల్లో ఇది ఏడో శతకం. విదేశీ గడ్డపై ఐదో శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ టెస్టు ఓపెనర్‌గా పలు రికార్డుల బద్దలుకొట్టాడు.
►టీమిండియా టెస్టు ఓపెనర్‌గా విదేశాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో సునీల్ గావస్కర్(81 ఇన్నింగ్స్‌లో 12 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో కేఎల్ రాహుల్( 34 ఇన్నింగ్స్‌లో 5 శతకాలు) ఉండడం విశేషం. ఇక మూడో స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్(59 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు) ఉన్నాడు. ఇక వినూ మాన్కడ్(19 ఇన్నింగ్స్‌లు), రవిశాస్త్రి(19 ఇన్నింగ్స్‌లు) మూడేసి సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నారు.
►ఇక సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన రెండో టెస్టు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇంతకముందు వసీం జాఫర్ 2006-07లో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో 116 పరుగులు సాధించాడు.
►ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డపై పర్యాటక జట్టు ఓపెనర్‌గా సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇంతకముందు సయీద్ అన్వర్(పాకిస్తాన్), క్రిస్ గేల్(వెస్టిండీస్) మాత్రమే ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment