2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఒకే జట్టుకి(ఆర్సీబీ) ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కిన విరాట్ కోహ్లి.. ఆటగాడిగా ఎంత సక్సెస్ సాధించినప్పటికీ, కెప్టెన్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 9 సీజన్ల పాటు ఆర్సీబీని ముందుండి నడిపించిన ఈ టీమిండియా మాజీ కెప్టెన్.. ఒక్క టైటిల్ కూడా నెగ్గలేక, 2021 సీజన్ అనంతరం జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
ఇటీవల ఆర్సీబీ తమ ఫ్రాంచైజీకి ఆడిన ఆటగాళ్లతో ఓ కార్యక్రమం నిర్వహించగా, అందులో పాల్గొన్న కోహ్లి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2016 ఐపీఎల్ ఫైనల్లో ఓటమి ఇప్పటికీ బాధిస్తుందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ హైలైట్స్ ప్లే అవుతుండగా నాటి జట్టు సహచరుడు కేఎల్ రాహుల్ స్క్రీన్ షాట్ తీసి తనకు పంపాడని గుర్తు చేసుకున్నాడు. వాటిని చూస్తుంటే ఇప్పటికీ బాధగా ఉంటుందని, ఆ బాధకు అంతే లేదని వాపోయాడు.
కాగా, హోరాహోరీగా జరిగిన ఆ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. 209 పరుగుల లక్ష్య ఛేదనలో ఒకానొకదశలో 10.2 ఓవర్లలో 114/0 పరుగులు చేసిన ఆర్సీబీ, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమై, టైటిల్‌ను చేజార్చుకుంది. క్రిస్ గేల్ (38 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), విరాట్ కోహ్లి (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నాటి సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి.. 16 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 81.08 సగటున 973 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు నేటికీ అతని పేరిటే పదిలంగా ఉంది.
చదవండి: Virat Kohli: డొక్కు కారు పంపి ఆర్సీబీ యాజమాన్యం అవమానించింది..!
Comments
Please login to add a commentAdd a comment