చెన్నై: తప్పక గెలిస్తేనే ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలిచే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) అదరగొట్టింది. చెన్నై సూపర్‌కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. బౌలింగ్‌తో చెన్నై బ్యాటర్లను వారి సొంతగడ్డపై అడ్డుకున్న నైట్‌రైడర్స్ తర్వాత లక్ష్యఛేదనలో తడబడినా... కెప్టెన్ నితీశ్ రాణా (44 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (43 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీల పోరాటంతో నెగ్గింది.
ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోనేందుకు టాపార్డర్ బ్యాటర్స్ సహా హిట్టర్ శివమ్ దూబే (34 బంతుల్లో 48 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కష్టపడ్డాడు. నరైన్, వరుణ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి గెలిచింది.
దీపక్ చహర్ (3/27) పేస్‌తో కోల్‌కతా టాపార్డర్‌కు చెక్ పెట్టాడు. గుర్బాజ్ (1), వెంకటేశ్ (9), జేసన్ రాయ్ (12)లు నిష్క్రమించడంతో 33 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. ఈ దశలో నితీశ్ రాణా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రింకూ సింగ్ నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించి గెలుపుబాట వేశారు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) వైభవ్ (బి) వరుణ్ 17; కాన్వే (సి) రింకూ (బి) శార్దుల్ 30; రహానే (సి) రాయ్ (బి) వరుణ్ 16; రాయుడు (బి) నరైన్ 4; దూబే (నాటౌట్) 48; మొయిన్ అలీ (బి) నరైన్ 1; జడేజా (సి) వరుణ్ (బి) వైభవ్ 20; ధోని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–31, 2–61, 3–66, 4–68, 5–72, 6–140. బౌలింగ్: వైభవ్ 4–0–30–1, హర్షిత్ రాణా 2–0–19–0, వరుణ్ 4–0–36–2, సునీల్ నరైన్ 4–0–15–2, శార్దుల్ 3–0–15–1, సుయశ్ 3–0–29–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) పతిరణ (బి) చహర్ 12; గుర్బాజ్ (సి) తుషార్ (బి) చహర్ 1; వెంకటేశ్ (సి) జడేజా (బి) చహర్ 9; నితీశ్ రాణా (నాటౌట్) 57; రింకూ సింగ్ (రనౌట్) 54; రసెల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–4, 2–21, 3–33, 4–132. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–27–3, తుషార్ 3.3–0–25–0, మొయిన్ అలీ 4–0–31–0, తీక్షణ 3–0–22–0, పతిరణ 3–0–23–0, జడేజా 2–0–18–0.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ Vs హైదరాబాద్ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment