Who Is Lionel Messi Wife Antonella Roccuzzo And Their Love Story In Telugu - Sakshi
Sakshi News home page

Lionel Messi Love Story: ఇద్దరిదీ ఒకే ఊరు! ఐదేళ్ల వయసులోనే పరిచయం! ముచ్చటగా ముగ్గురు కొడుకులు

Published Wed, Dec 14 2022 4:01 PM | Last Updated on Mon, Feb 13 2023 2:17 PM

Lionel Messi Gorgeous Wife Overjoyed Who Is Antonella Roccuzzo - Sakshi

భార్య ఆంటోనీలాతో మెస్సీ (PC: Antonela Roccuzzo Instagram)

Lionel Messi- Antonella Roccuzzo Love Story: ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు.. ఆ ఒక్కటి దాటేస్తే చాలు ప్రపంచకప్‌ విజేతగా నిలవాలన్న స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆదివారం (డిసెంబరు 18) నాటి ఫైనల్లో గెలిచి తన కీర్తికిరీటంలో వరల్డ్‌కప్‌ టైటిల్‌ అనే కలికితురాయి చేర్చుకున్నాడు. ఖతర్‌లో క్రొయేషియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో అర్జెంటీనా విజయం ద్వారా ఈ మేరకు అడుగులు పడిన విషయం తెలిసిందే.

మెస్సీ, జూలియన్‌ అల్వారెజ్‌ అద్భుత గోల్స్‌ చేయడంతో క్రొయేషియాను 3-0తో మట్టికరిపించిన అర్జెంటీనా ఆరోసారి ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో అర్జెంటీనాలో సంబరాలు అంబరాన్నంటాయి. వీధులన్నీ జనసంద్రమయ్యాయి. మెస్సీ బృంద నామస్మరణతో మారుమ్రోగిపోయాయి. 

ఈ విజయంతో మెస్సీ సహా అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోగా.. అతడి కుటుంబం సైతం తమదైన శైలిలో సెలబ్రేట్‌ చేసుకుంది. ముఖ్యంగా తమ ముగ్గురు పిల్లలతో ఈ మ్యాచ్‌కు హాజరైన మెస్సీ సతీమణి ఆంటోనీలా రొకుజో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

ముగ్గురు కొడుకులతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చిన ఆమె.. ఇన్‌స్టా వేదికగా వాటిని పంచుకుంటూ మెస్సీపై ప్రేమను చాటుకుంది. ‘‘ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో మీకు చెప్పలేను. ఎందుకంటే చెప్పినా కూడా మీకు అర్థం కాదు. లెట్స్‌ గో అర్జెంటీనా.. లెట్స్‌ గో మెస్సీ’’ అంటూ ఆంటోనీలా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది.

మెస్సీ వ్యక్తిగత జీవితం, కుటుంబానికి సంబంధించిన ఈ ఫొటోలు నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి. దీంతో ఆంటోనీలా రొకజో గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో ఇంతకీ ఆంటోనీలా ఎవరు? మెస్సీకి ఎలా పరిచయం? వీరి ప్రేమకథ ఎలా మొదలైంది? మెస్సీ విజయాల్లో ఆమె పాత్ర? తదితర విషయాలు తెలుసుకుందాం!


PC:  Antonela Roccuzzo Instagram

ఇద్దరిదీ ఒకే ఊరు.. ఐదేళ్ల వయసు నుంచే..
ఆంటోనీలా స్వస్థలం రొసారియో. అర్జెంటీనాలోని మూడో అతిపెద్ద పట్టణం. మెస్సీ జన్మించింది కూడా ఇక్కడే! వీళ్లిద్దరు చిన్ననాటి స్నేహితులు. ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే కలిసి ఆడుకునేవారట. ఆంటోనీలా కజిన్‌ లుకాస్‌ స్కాగ్లియా మెస్సీకి చిన్ననాటి స్నేహితుడు. కాగా లుకాస్‌ కూడా ఫుట్‌బాలరే!

కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా
మిడ్‌ఫీల్డర్‌గా గుర్తింపు దక్కించుకున్న అతడు కొన్నాళ్లు కోచ్‌గానూ వ్యవహరించాడు. అలా కామన్‌ ఫ్రెండ్‌ లుకాస్‌ ద్వారా చేరువైన మెస్సీ, ఆంటోనీలాల స్నేహం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో సహజీవనం చేసిన ఈ జంట.. బార్సిలోనా, అర్జెంటీనా జట్ల తరఫున మెస్సీ అరంగేట్రం జరిగిన మూడేళ్లకు అంటే 2008లో తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రకటించింది.

అతడికి ఆట అంటే ప్రాణం.. మరి ఆమెకు?
ఆంటోనీలా హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ చదివింది. డెంటల్‌ సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. మెస్సీ బార్సిలోనాకు ఆడుతున్న సమయంలో అతడికి మరింత చేరువైన ఆమె.. ప్రస్తుతం మోడల్‌గా కెరీర్‌ కొనసాగిస్తోంది. పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తూ మెస్సీ కెరీర్‌లో విజయవంతంగా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తోంది.


PC:  Antonela Roccuzzo Instagram

2017లో వివాహం.. ముగ్గురు కొడుకులు
ఇద్దరు కొడుకులు జన్మించిన తర్వాత మెస్సీ- ఆంటోనీలా పెళ్లి చేసుకున్నారు. 2017లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కాగా పెళ్లైన ఏడాదికి ఈ జంటకు మరో కుమారుడు సీరో జన్మించాడు. తియాగో(2012), మాటియో(2015)లకు తమ్ముడు వచ్చాడు.

విశేషమేంటంటే.. మెస్సీ ముగ్గురు కుమారులు కూడా ఫుట్‌బాల్‌కు వీరాభిమానులు. తల్లితో కలిసి తండ్రి ఆడే మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లడం వీరికి అలవాటు. ప్రస్తుతం వీరు ఖతర్‌లో ఉన్నారు. మెస్సీకి సంబంధించిన ప్రతీ మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇక మెస్సీ పెద్ద కుమారుడు తియాగో తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ఆటలో ఓనమాలు నేర్చుకుంటున్న జూనియర్‌ మెస్సీ.. తండ్రిలాగే స్టార్‌ ఫుట్‌బాలర్‌ ఎదగాలనే పట్టుదలతో ఉన్నాడు.

చదవండి: Rishabh Pant: బంగ్లాతో టెస్టు.. రిషభ్‌ పంత్‌ అరుదైన రికార్డు! రెండో భారత వికెట్‌ కీపర్‌గా..  
Ranji Trophy 2022-23: తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న అర్జున్‌ టెండూల్కర్‌.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement