లండన్: ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ అభిమాని జార్వో ఎవరికి రానంత పేరు సంపాదించాడు. ఒకే టెస్టు సిరీస్‌లో సెక్యూరిటీని దాటుకొని రెండుసార్లు మైదానంలోకి వచ్చిన జార్వో సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయిడు. జార్వో వ్యవహరించిన తీరు తప్పుగా ఉన్నప్పటికీ అంత సెక్యురిటీని దాటుకొని మైదానంలోకి దూసుకురావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక వరుసగా లార్డ్స్, లీడ్స్ టెస్టుల్లో తన ఎంట్రీతో ఆటకు అంతరాయం కలిగించిన జార్వోపై హెడ్డింగే స్టేడియం నిర్వాహకులు జీవితకాలం నిషేధం విధించారు.
అయితే ఫ్రాంక్ స్టార్‌గా మంచి గుర్తింపు ఉన్న జార్వో అసలు పేరు డేనియల్ జార్విస్. బీఎండబ్ల్యూ జార్వో పేరుతో జార్వో నడుపుతున్న యూ ట్యూబ్‌చానెల్‌కు లక్ష మంది సబ్‌స్క్రైబర్స్ ఉండడం విశేషం. వృత్తి పరంగా కమెడియన్, ఫిల్మ్ మేకర్, ఫ్రాంక్‌స్టార్‌గా రాణిస్తున్న జార్వోను ఒక చానెల్ ఇంటర్య్వూ చేసింది. ఈ నేపథ్యంలో జార్వో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
చదవండి: Shaheen Afridi: కెరీర్‌లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు
►పబ్లిసిటీ కోసం టీమిండియా జెర్సీ ధరించారా.. లేకపోతే నిజంగానే ఇండియాకు అభిమానా?
- స్వతహాగా నేను టీమిండియాకు వీరాభిమానిని. దాని వెనుక పెద్ద కథ ఉంది. లార్డ్స్ టెస్టు సమయంలో భారత ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా ఉన్నారు. ఇంగ్లండ్ జట్టుతో పోలిస్తే.. టీమిండియా ఆటగాళ్లు అభిమానులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతారని తెలసుకున్నా. వారితో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఈ దారిని ఎంచుకున్నా. ఈ నేపథ్యంలోనే లార్డ్స్ టెస్టులో టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాను. ఒక విధంగా ఫ్రాంక్ చేసే అవకాశం వచ్చిందని భావించా. టీమిండియా ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం మాత్రం రాలేదు. అందుకే మూడో టెస్టులో ఏకంగా బ్యాట్, ప్యాడ్స్‌తో మైదానంలోకి వచ్చేశా అని తెలిపాడు.
► మీకిష్టమైన టీమిండియా క్రికెటర్ ఎవరు?
- వ్యక్తిగతంగా నేను రవిచంద్రన్ అశ్విన్‌కు వీరాభిమానిని. కానీ ఈ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ తన హావభావాలతో నా ఫెవరెట్ క్రికెటర్ల లిస్టులో చేరిపోయాడు.
► ఇండియా, ఇంగ్లండ్ మధ్య వరల్డ్‌కప్ ఫైనల్ జరిగితే మీ మద్దతు ఎవరికి ?
- కచ్చితంగా టీమిండియాకే నా మద్దతు ఉంటుంది. ఇక లార్డ్స్ టెస్టులో టీమిండియా జెర్సీ ధరించడం ద్వారా మరోసారి ఇండియన్ అయ్యాను. నా దృష్టిలో ఇది చాలా గొప్ప విషయం.
► లీడ్స్ టెస్టు తర్వాత మీపై జీవితకాల నిషేధం పడడంపై బాధపడుతున్నారా?
- అలాంటిదే లేదు.. నేను కావాలని చేసింది కాదు. టీమిండియాపై అభిమానంతో చేశాను. నా బ్యాటింగ్‌కు భయపడి ఇంగ్లండ్ జట్టు నా పై జీవితకాల నిషేధం విధించిందేమో(నవ్వుతూ). అయినా మరోసారి ఇలా చేయకపోవచ్చు.
►రవిచంద్రన్ అశ్విన్‌కు మీరు వీరాభిమాని.. ఈ మధ్యన అశ్విన్‌ను కలిసే అవకాశం వచ్చిందా?
- ఇప్పటివరకు అశ్విన్‌ను కలవలేదు. కేవలం ట్విటర్‌లోనే అతనికి రీట్వీట్స్ చేసేవాడిని. అవకాశమొస్తే తప్పకుండా కలుస్తా.
► ఇప్పటివరకు ఒక్కసారైనా ఇండియాకు వెళ్లారా?
- ఇంతవరకు ఇండియాకు మాత్రం వెళ్లలేదు. కానీ ఇప్పుడు వెళ్లాలనుకుంటున్నా. నాకు నచ్చిన ప్రదేశాల లిస్ట్‌లో తాజాగా ఇండియా కూడా చేరింది.
చదవండి: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో కివీస్ చెత్త రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment