ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ విజయ్ దాహియాపై ఫ్రాంచైజీ యాజమాన్యం వేటు వేసింది. ఈ విషయాన్ని ఇరు పక్షాలు ధృవీకరించాయి. ఎల్‌ఎస్‌జీతో రెండేళ్ల బంధాన్ని తెంచుకుంటున్నట్లు దాహియా తన సోషల్‌మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించగా.. లక్నో మేనేజ్‌మెంట్ దాహిదాకు ఆల్ ద బెస్ట్ చెప్పింది.
హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ బాధ్యతలు చేపట్టాక లక్నో ఫ్రాంచైజీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల గౌతమ్ గంభీర్ లక్నో మెంటార్షిప్‌ను వదులకుని తన హోం ఫ్రాంచైజీ అయిన కేకేఆర్‌కు వెళ్లిపోగా.. లాంగర్ పట్టుబట్టి శ్రీధరన్ శ్రీరామ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా తన బృందంలో చేర్చుకున్నాడు. తాజాగా దాహియా కూడా ఫ్రాంచైజీని వీడటంతో జట్టులొ అంతర్గతంగా ఎదో జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.
కాగా, కొన్ని రోజుల కిందట లక్నో యాజమాన్యం ఆండీ ఫ్లవర్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో జస్టిన్ లాంగర్‌ను కూర్చోబెట్టింది. లాంగర్‌కు ఆసీస్ హెడ్ కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం అతని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి అక్కున చేర్చుకుంది. ఎల్‌ఎస్‌జీతో జతకట్టినప్పటి నుంచి లాంగర్ తనదైన ముద్రను వేసుకుంటున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 వేలంలోనూ అతను చాలా కీలకంగా వ్యవహరించాడు.
ఈ వేలంలో లక్నో ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాహియా స్థానంలో కొత్త అసిస్టెంట్ కోచ్‌గా సురేశ్ రైనాను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి రైనా తన స్థాయికంటే చిన్నదైన అసిస్టెంట్ కోచ్ పదవి చేపడతాడో లేదో వేచి చూడాలి. మరోవైపు రైనాను గంభీర్ స్థానంలో లక్నో మెంటార్‌గా నియమిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
All the best for your next chapter, @vijdahiya !🙏💙 pic.twitter.com/7RhyyOuXnD
— Lucknow Super Giants (@LucknowIPL) January 1, 2024
కాగా, లక్నో సూపర్ జెయింట్స్ 2022 సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు ఓ మోస్తరు ప్రదర్శనలు చేసి ఫైనల్ ఫోర్ వరకు చేరింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలో ఈ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మరోవైపు లక్నోతో పాటే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఓ సారి ఛాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిచింది.
లక్నో కోచింగ్ సిబ్బంది:
- హెడ్‌కోచ్ : జస్టిన్ లంగర్
- అసిస్టెంట్ కోచ్ : శ్రీధరన్ శ్రీరామ్
- ఫాస్ట్ బౌలింగ్ కోచ్ : మోర్నీ మోర్కెల్
- ఫీల్డింగ్ కోచ్ : జాంటీ రోడ్స్
- స్పిన్ బౌలింగ్ కోచ్ : ప్రవీణ్ తాంబే
Comments
Please login to add a commentAdd a comment