
ఖతర్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగుతున్న స్టేడియంకు దగ్గర్లో భారీ అగ్నిప్రమాద సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న లూసెయిల్ స్టేడియం సమీపంలో కెటాయ్‌ఫ్యాన్ ఐలాండ్ నార్త్ ఫ్యాన్స్ విలేజ్ ఉంది. ఇక్కడికి దగ్గర్లో నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.
దట్టమైన నల్లని పొగ వ్యాపించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్రిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటల్ని ఆర్పేశాయి. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియలేదని అధికారులు తెలిపారు. రోడ్డు మీద వెళ్తున్న కొందరు ప్రమాదం వీడియోల్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Huge Fire 🔥 near the Lusail area north of Doha, Qatar. Direction where the main stadium is located.
— Jose Pablo Arnau (@ArnauSport) November 26, 2022
Firetruck on the way. 🚒 pic.twitter.com/BULGQ0LxIj
Comments
Please login to add a commentAdd a comment