బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయపడగా.. తాజాగా ఈ జాబితాలో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ చేరాడు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం పెర్త్‌లోని డబ్ల్యూఎసీఎ గ్రౌండ్‌లో మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతోంది.
ఈ క్రమంలో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా తన మోచేయికి బంతి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాహుల్ తన బ్యాటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు.
కానీ నొప్పి తగ్గకపోవడంతో రాహుల్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే రాహుల్ గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అప్‌డేట్ రాలేదు.
భారత ఓపెనర్ ఎవరు?
కాగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నాడు. దీంతో జైశ్వాల్ జోడీగా కేఎల్ రాహుల్‌ను పంపించాలని టీమ్ మేనెజ్‌మెంట్ నిర్ణయించుకుంది. ఇప్పుడు రాహుల్ కూడా గాయం బారిన పడడంతో మేనెజ్‌మెంట్ ఆందోళన చెందుతుంది. ఒక వేళ రాహుల్ దూరమైతే అభిమన్యు ఈశ్వరన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది.
చదవండి: IND vs AUS: 'కింగ్ తన రాజ్యానికి తిరిగొచ్చాడు'.. ఆసీస్‌ను హెచ్చరించిన రవిశాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment