IPL 2023: Mumbai Indians Became The 1st IPL Team To Chase Down 200-Plus In Back-To-Back Games - Sakshi
Sakshi News home page

#MumbaiIndians: ముంబై ఇండియన్స్‌కే సాధ్యం.. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి

Published Wed, May 3 2023 11:53 PM | Last Updated on Thu, May 4 2023 8:56 AM

MI-1st Team Successfully Chase-down 200 Plus Targets Consecutively IPL - Sakshi

Photo: IPL Twitter

ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో మళ్లీ తన తడాకా చూపిస్తోంది. బౌలింగ్‌లో వీక్‌గా ఉన్నప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం దుర్బేద్యంగా కనిపిస్తోంది. బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లు చేసిన విధ్వంసం పాత ముంబై ఇండియన్స్‌ను గుర్తుకుతెచ్చింది. 


Photo: IPL Twitter

సూర్య, ఇషాన్‌లు ఔటైనప్పటికి తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌లు మిగతా పనిని పూర్తి చేశారు. ఈ సీజన్‌లో ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన ముంబై ఆ తర్వాత హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. కానీ
మధ్యలో మళ్లీ రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండొదలకు పరుగుల టార్గెట్‌ను చేధించిన ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలో ఒక జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండొందలకు పైగా స్కోరును చేధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

ఇక ముంబై, పంజాబ్‌ మ్యాచ్‌ ద్వారా పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటంటే..
► ఈ సీజన్‌లో  తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 200 ప్లస్‌ స్కోరు చేసి కూడా పరాజయం పాలవ్వడం ఇది ఐదో సారి. ఇంతకముందు ప్రతీ సీజన్‌లో రెండుసార్లు మాత్రమే ఇలా జరిగింది. 
► ఇక ఒక సీజన్‌లో 200 ప్లస్‌ స్కోర్లను రెండుసార్లు చేధించిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ మూడో జట్టుగా నిలిచింది. ఇంతకముందు 2014లో పంజాబ్‌ కింగ్స్‌, 2018లో సీఎస్‌కే ఈ ఫీట్‌ సాధించాయి.
► ఐపీఎల్‌లో అత్యధిక టార్గెట్‌ చేధించిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచింది. 2020లో రాజస్తాన్‌ రాయల్స్‌ పంజాబ్‌పై 224 పరుగులు టార్గెట్‌ను చేధించి తొలి స్థానంలో ఉండగా.. 2021లో ముంబై ఇండియన్స్‌ సీఎస్‌కే 219 పరుగుల టార్గెట్‌ను చేధించి రెండో స్థానంలో ఉంది.
► పంజాబ్‌ కింగ్స్‌కు సొంత మైదానంలో ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఇందులో రెండు మొహలీలో రాగా.. మరో రెండు ఓటములు ధర్శశాలలో నమోదయ్యాయి.

చదవండి: ఆర్చర్‌ను మించిపోయిన అర్ష్‌దీప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement