వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు. శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో జట్టులోకి వచ్చిన షమీ.. తన బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
ఈ మ్యాచ్‌లో తన వేసిన తొలి బంతికే షమీ వికెట్ సాధించాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓవరాల్‌గా తన 10 ఓవర్ల కోటాలో 54 పరుగలిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
షమీ అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో 5 వికెట్లతో చెలరేగిన మహ్మద్ షమీ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే రెండు సార్లు 5 వికెట్ల హాల్ సాధించిన తొలి భారత బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు. అంతకుముందు 2019 ప్రపంచకప్‌లో ఆఫ్గానిస్తాన్‌పై కూడా షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇక భారత తరపున వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్, వెంకటేష్ ప్రసాద్, రాబిన్ సింగ్, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ చెరో ఒక్కసారి 5 వికెట్ల ఘనత సాధించారు.
చదవండి: ODI World Cup 2023: టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్ క్రీడా స్ఫూర్తి! ఏం జరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment