Photo: IPL Twitter
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఐపీఎల్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో షమీ నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షమీ ఐపీఎల్ కెరీర్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. అందులోనూ పవర్‌ప్లేలోనే షమీ తన కోటా పూర్తి చేయడంతో నాలుగు వికెట్లు తీసుకోవడం మరో విశేషం.
షమీ తన ఫామ్‌ను ఇలాగే కంటిన్యూ చూస్తే ఐపీఎల్ తర్వాత జరగనున్న డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆసీస్‌కు కష్టాలు తప్పేలా లేవు, ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా పేస్ దళాన్ని షమీనే నడిపించాల్సి ఉంది. గాయంతో బుమ్రా దూరం కావడంతో.. షమీ పెద్దన్న పాత్ర పోషించనున్నాడు. అంతవరకు షమీ గాయపడకుండా జాగ్రత్తగా ఉంటే మాత్రం ఆసీస్‌కు చుక్కలే. జూన్ ఏడు నుంచి 11వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
ఇక ఐపీఎల్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఇషాంత్ శర్మ( 5/12, వర్సెస్ కొచ్చిన్ టస్కర్స్, 2012) ఉన్నాడు. రెండో స్థానంలో షమీ(4/7, వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్,2023), మూడో స్థానంలో ధవల్ కులకర్ణి (4/8 -వర్సెస్ ఆర్‌సీబీ, 2016), నాలుగో స్థానంలో అజిత్ చండిలా (4/9 వర్సెస్ పుణే వారియర్స్, 2012) ఉన్నారు.
🤯🤯🤯 - It's all happening in #GTvDC
— JioCinema (@JioCinema) May 2, 2023
A double-quick blow for @DelhiCapitals in the first two overs 👀 #GTvDC #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/IFmx34UvLQ
చదవండి: ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు.. ఇలాంటి ప్లేయర్ అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment