( ఫైల్ ఫోటో )
వన్డే ప్రపంచకప్-2023కు ముందు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి భారీ ఊరట లభించింది. అతడి భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో అలీపూర్‌లోని ట్రయల్ కోర్టు షమీకి బెయిల్ మంజూరు చేసింది. రెండు వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. షమీతో పాటు అతని సోదరుడు మహ్మద్ హసీమ్‌కు సైతం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మంగళవారం విచారణ సందర్భంగా న్యాయస్ధానానికి తన సోదరుడితో కలిసి షమీ హాజరయ్యాడు. ఈ మెరకు షమీ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా 2018లో జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మహ్మద్ షమితో పాటు అతడి సోదరుడిపై హసిన్ జహాన్ ఫిర్యాదు చేసింది. షమీతో పాటు అతడు సోదరుడు కూడా తనను వేధిస్తున్నారంటూ హసిన్ కేసు పెట్టింది. అంతేకాకుండా షమీ వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఆమె ఆరోపణలు చేసింది.
దీంతో షమీతో పాటు అతడి అన్నయ్య హసిబ్‌ను కోల్‌కతా పోలీసుల మహిళా ఫిర్యాదుల విభాగం ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆగస్టు 29, 2019లో అలీపూర్ అడిషినల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 9న కోల్‌కతా స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్‌పై స్టే విధించింది.
అ తర్వాత జనవరి, 2023లో హసిన్ జహాన్‌కు నెలవారీ పరిహారంగా రూ. 50 వేలు చెల్లించాలని షమీని అలీపూర్ కోర్టు ఆదేశించింది. అదే విధంగా షమీపై ఉన్న స్టేను ఎత్తివేయాలని హసిన్ జహాన్ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ఇక ఆసియాకప్ పర్యటను ముగించికుని భారత్‌కు వచ్చిన షమీ.. వరల్డ్‌కప్‌కు సిద్దమవుతున్నాడు. ఆక్టోబర్ 5నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
చదవండి: Shaheen Afridi Marriage: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment