
మహ్మద్ షమీ(ఫైల్ ఫోటో)
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే రెండో టెస్టుకు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరం కాగా.. ఇప్పుడు వెటరన్ పేసర్ షమీ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన భారత జట్టులో షమీకి చోటు దక్కలేదు.
కానీ ఆఖరి మూడు టెస్టులకైనా తిరిగి వస్తాడని జట్టు మేనెజ్‌మెంట్ భావించింది. అయితే ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ.. పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. షమీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు.
షమీ బౌలింగ్ వేసే క్రమంలో చీలమండ నొప్పితో బాధపడుతున్నాడని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ బజ్ పేర్కొంది. షమీ తన గాయం నుంచి కోలుకోవడానికి ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చేది అనుమానమే క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
ఇక వన్డే వరల్డ్‌కప్ అద్బుత ప్రదర్శన కనబరిచిన అనంతరం షమీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా శుక్రవారం నుంచి విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లండ్ రెండో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: Sarfaraz Khan: చిన్న జట్ల మీద ఆడితే సరిపోతుందా? మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment