టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో శుభారంభం చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన షమీ.. మూడు వికెట్లు.. ఒక రనౌట్‌తో మొత్తంగా ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి టీమిండియాకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. కాగా టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన కాసేపటికే అదే స్టేడియంలో పాకిస్తాన్, ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్ ఆడనున్నాయి.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మహ్మద్ షమీ.. పాకిస్తాన్ స్టార్ షాహిన్ అఫ్రిదికి కాసేపు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించాడు. బౌలింగ్‌లో అఫ్రిదికి మెళుకువలు చెబుతూ కనిపించాడు. రైట్ హ్యాండర్ అయిన షమీ.. అఫ్రిది కోసం లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఏకకాలంలో ఇద్దరు బౌలర్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
ఇక చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు మరో వారం మిగిలి ఉంది. అక్టోబర్ 23న(ఆదివారం) ఇరుజట్లు పోటీ పడనున్నాయి. ఇక గాయాల కారణంగా అటు షమీ.. ఇటు అఫ్రిది కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యారు. ఇక టీమిండియా ఫ్రంట్‌లైన్ పేసర్ బుమ్రా గాయపడడంతో షమీ లైన్‌లోకి వచ్చాడు. షమీ టి20 ఆడి దాదాపు ఏడాది కావొస్తున్నప్పటికి ఇవాళ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో మాత్రం అద్భుత బౌలింగ్ కనబరిచాడు. అటు అఫ్రిది కూడా చాలా గ్యాప్ తర్వాత మ్యాచ్ ఆడనుండడం.. ఆపై టీమిండియాతో మ్యాచ్ కావడంతో అతనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment