వన్డే ప్రపంచకప్-2023లో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా నవంబర్2న శ్రీలంకతో భారత్‌తో తలపడనుంది. ఇదే వేదికలో 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ భారత్-లంక మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రేయస్ అయ్యర్‌పై వేటు..
కాగా వరుసగా విఫలమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేయాలని భారత జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ టోర్నీలో అయ్యర్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే రాలేదు. ఈ క్రమంలోనే అతడిని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. అదే విధంగా మహ్మద్ సిరాజ్ స్ధానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌లో టీమిండియాకు బ్యాడ్ న్యూస్..
Comments
Please login to add a commentAdd a comment