ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల వివరాలను ఇక్కడ చూద్దాం. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. 2024 సీజన్ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో ఓ ఆటగాడికి చెల్లించిన అత్యధిక ధర ఇదే.
అదే సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ ధర. స్టార్క్, కమిన్స్ తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ఐపీఎల్‌లో అత్యంత భారీ ధరను దక్కించుకున్నాడు. కర్రన్‌ను 2023 సీజన్‌లో వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లకు సొంతం చేసుకుంది.
కర్రన్ తర్వాత కెమరూన్ గ్రీన్- రూ. 17.50 కోట్లు (ఆర్సీబీ, 2023),
బెన్ స్టోక్స్- రూ. 16.25 కోట్లు (సీఎస్‌కే 2023),
క్రిస్ మోరిస్- రూ. 16.25 కోట్లు (రాజస్థాన్ రాయల్స్, 2021),
యువరాజ్ సింగ్- రూ. 16 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్, 2015),
నికోలస్ పూరన్- రూ. 16 కోట్లు (లక్నో, 2023),
పాట్ కమిన్స్- రూ. 15.50 కోట్లు (కేకేఆర్, 2020),
ఇషాన్ కిషన్- రూ. 15.25 కోట్లు (ముంబై ఇండియన్స్, 2022) టాప్-10 ఖరీదైన ఆటగాళ్లుగా ఉన్నారు.
ఐపీఎల్‌లో సీజన్ల వారీగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లు..
2008- ఎంఎస్ ధోని (సీఎస్‌కే)- రూ. 9.5 కోట్లు,
2009- కెవిన్ పీటర్సన్ (ఆర్సీబీ), ఆండ్రూ ఫ్లింటాఫ్ (సీఎస్‌కే)- రూ. 9.8 కోట్లు,
2010- షేన్ బాండ్ (కేకేఆర్), కీరన్ పోలార్డ్ (ముంబై ఇండియన్స్)- రూ. 4.8 కోట్లు,
2011- గౌతమ్ గంభీర్ (కేకేఆర్)- రూ. 14.9 కోట్లు,
2012- రవీంద్ర జడేజా (సీఎస్‌కే)- రూ. 12.8 కోట్లు,
2013- గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ముంబై ఇండియన్స్)- రూ. 6.3 కోట్లు,
2014- యువరాజ్ సింగ్ (ఆర్సీబీ)- రూ. 14 కోట్లు,
2015- యువరాజ్ సింగ్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్)- రూ. 16 కోట్లు,
2016- షేన్ వాట్సన్ (ఆర్సీబీ)- రూ. 9.5 కోట్లు,
2017- బెన్ స్టోక్స్ (రైజింగ్ పూణే జెయింట్స్)- రూ. 14.5 కోట్లు,
2018- బెన్ స్టోక్స్ (రాజస్థాన్ రాయల్స్)- రూ. 12.5 కోట్లు,
2019- జయదేవ్ ఉనద్కత్ (రాజస్థాన్), వరుణ్ చక్రవర్తి (పంజాబ్)- రూ. 8.4 కోట్లు,
2020- పాట్ కమిన్స్ (కేకేఆర్)- రూ. 15.5 కోట్లు,
2021- క్రిస్ మోరిస్ (రాజస్థాన్)- రూ. 16.25 కోట్లు,
2022- ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్)- రూ. 15.25 కోట్లు,
2023- సామ్ కర్రన్ (పంజాబ్ కింగ్స్)- రూ. 18.5 కోట్లు,
2024- మిచెల్ స్టార్క్ (కేకేఆర్)- రూ. 24.75 కోట్లు
కాగా, ఈ ఏడాది ఫ్రాంచైజీలు తమతమ రిటెన్షన్ జాబితాలను సమర్పించడానికి అక్టోబర్ 31 చివరి తేదీ. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్-2025 వేలం నవంబర్ 25 లేదా 26 తేదీల్లో రియాద్‌లో జరగవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment