బంగ్లాదేశ్ కోచ్ హతురసింఘా
చెన్నై: భారత్ లాంటి పెద్ద జట్టుతో టెస్టు సిరీస్ ఆడటమే సవాల్ వంటిదని బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చందిక హతురసింఘా అన్నాడు. ఇటీవల పాకిస్తాన్‌పై 2–0తో సిరీస్ గెలిచి మంచి జోరు మీద ఉన్న బంగ్లాదేశ్ జట్టు గురువారం నుంచి టీమిండియాతో తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ‘భారత్‌లో భారత్‌ను ఎదుర్కోవడం అంటే కఠినమైన సవాల్.
ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో ఆడబోతున్నాం. అలాంటప్పుడే మన అసలు సత్తా బయట పడుతుంది. పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ కీŠల్‌న్‌స్వీప్ చేయడం మా ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పరిస్థితులకు తగ్గట్లు ఆడితే మంచి ఫలితాలు వస్తాయని అది నిరూపించింది. ప్రస్తుత బంగ్లాదేశ్ జట్టు సమతూకంగా ఉంది. మంచి పేసర్లు అందుబాటులో ఉన్నారు.
ఇక స్పిన్ విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటింగ్‌లో కూడా చాలా మంది అనుభవజు్ఞలు ఉన్నారు. బంగ్లాదేశ్ క్రికెట్‌లో షకీబ్ అల్ హసన్ పాత్ర కీలకం. అతడి ఆల్‌రౌండ్ నైపుణ్యం, అనుభవం జట్టుకు మరింత స్వేచ్ఛను ఇస్తుంది. గత కొన్నాళ్లుగా మెహదీ హసన్ మిరాజ్ ఎంతో పరిణతి సాధించాడు. అది జట్టుకు అదనపు ప్రయోజనం చేకూర్చుతోంది’ అని హతురసింఘా మంగళవారం పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment