MI Vs GT: ముంబై మరో‘సారీ’  | IPL 2024 GT Vs MI: Gujarat Titans Beat Mumbai Indians By 6 Runs, Check Full Score Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 GT Vs MI: ముంబై మరో‘సారీ’ 

Published Mon, Mar 25 2024 1:52 AM | Last Updated on Mon, Mar 25 2024 9:42 AM

Mumbai Indians lost in the first match of IPL - Sakshi

వరుసగా 12వ ఏడాది ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ఓటమి 

6 పరుగులతో గుజరాత్‌ గెలుపు

రాణించిన సుదర్శన్, ఉమేశ్, మోహిత్‌

అహ్మదాబాద్‌: కొత్త కెప్టెన్ వచ్చినా... వరుసగా 12వ ఏడాది ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ కలిసి రాలేదు. వరుసగా 12వ సారి ముంబై ఐపీఎల్‌ సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. 2012 ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు తొలి మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టలేకపోయింది. కొత్త కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో ఈ మ్యాచ్‌లో ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు బౌలర్ల సమష్టి రాణింపుతో ఆఖరిదాకా పోరాడి 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు సాహా (19), శుబ్‌మన్‌ గిల్‌ (22 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలువలేదు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాయి సుదర్శన్‌ (39 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పటిష్టమైన ముంబై బౌలింగ్‌కు ఎదురునిలిచి జట్టును నడిపించాడు. అయితే బుమ్రా ఒకే ఓవర్లో మిల్లర్‌ (17),  సుదర్శన్‌లను అవుట్‌ చేయగా... ఆఖర్లో రాహుల్‌ తెవాటియా (15 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిని ప్రదర్శించాడు.

తర్వాత ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేయగలిగింది. ఇషాన్‌ కిషన్‌ (0), నమన్‌ ధీర్‌ (20)లను అవుట్‌ చేసిన ఒమర్జాయ్‌ ముంబై ఆరంభాన్ని దెబ్బకొట్టగా, మాజీ   కెప్టెన్ రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (38 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టును నడిపించారు. స్వల్పవ్యవధిలో వాళ్లిద్దరు అవుటయ్యాక ఒక్క తిలక్‌ వర్మే (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్‌) మెరుగైన స్కోరు చేశాడు.

టిమ్‌ డేవిడ్‌ (11), కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా (11)లాంటి హిట్టర్లు కూడా తేలిపోవడంతో ముంబై ఓడింది. ఒమర్జాయ్, ఉమేశ్, మోహిత్‌ శర్మ, స్పెన్సర్‌ జాన్సన్‌ తలా 2 వికెట్లు తీశారు. గుజరాత్‌ మాజీ సారథి పాండ్యా తాజాగా ముంబై కెప్టెన్‌గా టాస్‌కు రాగానే స్టేడియంలోని ప్రేక్షకులు అరచి గోల చేశారు.  

స్కోరు వివరాలు 
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (బి) బుమ్రా 19; శుబ్‌మన్‌ (సి) రోహిత్‌ (బి) చావ్లా 31; సాయి సుదర్శన్‌ (సి) తిలక్‌వర్మ (బి) బుమ్రా 45; అజ్మతుల్లా (సి) తిలక్‌వర్మ (బి) కొయెట్జీ 17; మిల్లర్‌ (సి) పాండ్యా (బి) బుమ్రా 12; విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 6; తెవాటియా (సి) నమన్‌ ధీర్‌ (బి) కొయెట్జీ 22; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–31, 2–64, 3–104, 4–133, 5–134, 6–161. బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్యా 3–0–30–0, ల్యుక్‌ వుడ్‌ 2–0–25–0, బుమ్రా 4–0–14–3, ములానీ 3–0–24–0, పియూశ్‌ చావ్లా 3–0–31–1, నమన్‌ ధీర్‌ 1–0–13–0, కొయెట్జీ 4–0–27–2.
 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) సాహా (బి) అజ్మతుల్లా 0; రోహిత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సాయి కిషోర్‌ 43; నమన్‌ ధీర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అజ్మతుల్లా 20; బ్రెవిస్‌ (సి) అండ్‌ (బి) మోహిత్‌ 46; తిలక్‌ వర్మ (సి) సబ్‌–మనోహర్‌ (బి) జాన్సన్‌ 25; డేవిడ్‌ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 11; హార్దిక్‌ (సి) తెవాటియా (బి) ఉమేశ్‌ 11; కొయెట్జీ (సి అండ్‌ బి) జాన్సన్‌ 1; ములానీ (నాటౌట్‌) 1; చావ్లా (సి) రషీద్‌ ఖాన్‌ (బి) ఉమేశ్‌ 0; బుమ్రా (నాటౌట్‌) 1;  ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–0, 2–30, 3–107, 4–129, 5–142, 6–148, 7–150, 8–160, 9–160. బౌలింగ్‌: ఒమర్జాయ్‌ 3–0–27–2, ఉమేశ్‌ 3–0–31–2, రషీద్‌ 4–0–23–0; సాయి కిషోర్‌ 4–0–24–1, జాన్సన్‌ 2–0–25–2, మోహిత్‌ శర్మ 4–0–32–2.   

ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X పంజాబ్‌
వేదిక: బెంగళూరు

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement