Ind Vs Nz: Netizens Reaction To Sanju Samsons Exclusion From 3rd T20I Against NZ - Sakshi
Sakshi News home page

NZ Vs IND 3rd T20I: సంజూ ఏం పాపం చేశాడు.. కావాలనే ఇలా చేస్తున్నారు! ఇది ఆన్యాయం

Published Tue, Nov 22 2022 12:49 PM | Last Updated on Tue, Nov 22 2022 1:15 PM

Netizens react to Sanju Samsons exclusion from final t20 Against nz - Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20కైనా భారత తుది జట్టులో దక్కుతుందని అంతా భావించారు. కానీ ఈ మ్యాచ్‌కు కూడా అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో జట్టు మేనేజేమెంట్‌పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కావాలనే శాంసన్‌ను పక్కన పెడుతున్నారని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రెండో టీ20లో దారుణంగా విఫలమైన పంత్‌కు మళ్లీ అవకాశం​ ఇవ్వడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. శాంసన్‌ ఏం పాపం చేశాడు.. కేవలం అతడు ఒక్కడం విషయంలోనే ఇలా వ్యవహరించం సరికాదు అని అభిమానులు వాపోతున్నారు.

"సంజూకు భారత్‌ తరపున ఆడే అవకాశం ఇవ్వకపోతే, కనీసం బిగ్‌బాష్‌ లీగ్‌ వంటి ఇతర లీగ్‌లో ఆడే ఛాన్స్‌ ఇవ్వండి. అతడి కెరీర్‌ను నాశనం చేయవద్దు. జట్టులో పంత్, కిషన్‌ వంటి వారికి ఆడకపోయినా అవకాశం ఇవ్వండి" అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక సంజూ చివరసారిగా ఈ ఏడాది ఆగస్టులో విండీస్‌ పర్యటనలో టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఇ‍క సిరీస్‌ డిసైడ్‌ర్‌ మ్యాచ్‌లో భారత జట్టు కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది.  ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో పేస్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు.
చదవండి: ENG Vs PAK: పాక్‌తో టెస్టు సిరీస్‌.. ఇంగ్లండ్‌ జట్టులోకి కొత్త వ్యక్తి; ఆటగాడు మాత్రం కాదు


చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement