విరాట్ కోహ్లి కెప్టెన్సీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా కోహ్లి.. మీడియా సమావేశంలో బీసీసీఐపై సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారని కోహ్లి ఆరోపించాడు. అదే విధంగా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తనకు ఎవరూ చెప్పలేదు అని కోహ్లి తెలిపాడు. అయితే కోహ్లి వాఖ్యలపై స్పందించిన బీసీసీఐ వాటిని తోసిపుచ్చింది. ఛీప్ సెలెక్టర్ కోహ్లితో కెప్టెన్సీ గురించి ముందుగానే చర్చించాడని బీసీసీఐ పేర్కొంది. కాగా అంతకుముందు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని బీసీసీఐ సెలక్షన్ కమీటీ, కోహ్లిని కోరడం... అందుకు కెప్టెన్ విరాట్ అంగీకరించలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే విరాట్ కోహ్లి చేసిన వాఖ్యలపై గంగూలీని మీడియా ప్రశ్నించగా, "నో కామెంట్స్" అంటూ అతడు తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ పరిశీలిస్తుందని గంగూలీ తెలిపాడు. "విరాట్ కోహ్లి కెప్టెన్సీ వివాదంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ప్రశ్నించగా, దీనిని బీసీసీఐ పరిశీలిస్తోంది. నో కామెంట్స్ అంటూ వెళ్లిపోయారు" అని పూజా మెహతా అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. ఇక మరి కొంతమంది ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయకూడదనే ఉద్దేశంతో గంగూలీ అలా బదులు ఇచ్చాడని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Rohit Sharma: గాయంతో సిరీస్‌కు దూరం.. 9 కోట్లతో భార్య పేరిట ప్రాపర్టీ కొనుగోలు చేసి!
In a first reaction to the Virat Kohli controversy, BCCI President Sourav Ganguly says, “no comments. BCCI is looking into it.”
— Pooja Mehta (@pooja_news) December 16, 2021
Comments
Please login to add a commentAdd a comment