Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. పంత్ ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2021 సీజన్‌కు గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతడి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలును పంత్ చేపట్టాడు. గతే ఏడాది సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ప్లేఆప్స్‌కు చేర్చాడు. కాగా తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ తన కోచ్, తండ్రి గురించి మాట్లాడూతూ ఎమోషనల్ అయ్యాడు. తన విజయంలో తండ్రి, కోచ్ తారక్ సిన్హా కీలక పాత్ర పోషించారని అతడు తెలిపాడు. కాగా పంత్ 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో ఉన్నప్పడు అతడి కోచ్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు.
"నేను ప్రపంచకప్ ముగిసిన తర్వాత నా కోచ్‌ను కలవాలి అనుకున్నాను. కానీ అంతలోనే అతను మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. అప్పుడు నేను ఇంగ్లండ్‌లో ఉన్నాను. అదే విధంగా మా నాన్నను నేను చాలా మిస్ అవుతున్నాను. మా నాన్న నన్ను వదిలి వెళ్లినప్పుడు కూడా నేను క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాను. అతడి చివరి చూపుకు కూడా నోచుకోలేదు. నేను ఈ రోజు ఈ స్ధాయిలో ఉన్నాను అంటే కారణం వీరిద్దరే. నా కోచ్ నాకు ఒక్క మాట చెప్పాడు. 'నీ జీవితంలో ఏమి జరిగినా, నీవు క్రికెట్‌ను మాత్రం వదలకు" అని అతను నాతో చెప్పారు. అదే విధంగా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి అని నా కోచ్ చెప్పేవారు. చివరగా నా జీవితంలో మా నాన్న , నా కోచ్ లేని లోటును ఎవరూ పూడ్చలేరు" అని పంత్ పేర్కొన్నారు.
చదవండి: IPL 2022: అతడి కెప్టెన్సీ భేష్ ఈసారి ఐపీఎల్ టైటిల్ వాళ్లదే: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment