వన్డే ప్రపంచకప్-2023కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. చాహల్‌కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కపోయినప్పటికీ.. వరల్డ్‌కప్‌కు మాత్రం ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ మరోసారి సెలక్టర్లు మొండి చేయి చూపించారు.
ఈ క్రమంలో చాహల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని చాహల్ నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. కౌంటీ ఛాంపియన్‌షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో కెంట్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు సమాచారం.
చాహల్ ఇంగ్లండ్ కౌంటీల్లో కెంట్ తరపున ఆడనున్నాడు. ఇందుకు సంబంధించి కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. కౌంటీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అతనికి ఎన్‌ఓసీ కూడా మంజూరు చేసింది.
అతడు భారత జట్టుకు అవసరమైతే వెంటనే జాతీయ జట్టుతో చేరుతాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా, ఉమేశ్‌యాదవ్ సహచర ఆటగాళ్లు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడతున్నారు.
చదవండి: ODI WC 2023: వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ.57లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment