టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో వరల్డ్ నెం.1 టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ పోరాటం ముగిసింది. వింబుల్డన్ 2021 టైటిల్ గెలిచి జోరుమీద ఉన్న జోకోవిచ్ టోక్యో ఒలింపిక్స్‌లో పతకం లేకుండానే ఇంటిముఖం పట్టాడు.సెమీ ఫైనల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతుల్లో ఓడిన నోవాక్ జొకోవిచ్, కారెన్నో బూస్టతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లోనూ పోరాడి ఓడాడు. రెండు గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ మ్యాచ్‌లో జొకోవిచ్... 4-6, 8-6, 3-6 తేడాతో ఓటమి పాలయ్యాడు.
తొలి సెట్ కోల్పోయినా, రెండో సెట్‌లో ప్రతిఘటించిన జోకోవిచ్ రెండో సెట్‌లో విజయం సాధించాడు. అయితే మూడో సెట్లో కారెన్నో బూస్ట 3-6 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జెరేవ్, రష్యా ప్లేయర్ కచానోవ్ మధ్య ఫైనల్ జరగనుంది. కాగా జకోవిచ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment