టోక్యో: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంపై గురి పెట్టిన ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఈ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో సోమవారం జరిగిన రెండో రౌండ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–4, 6–3తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై విజయం సాధించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. 74 నిమిషాలలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 14 ఏస్‌లు సంధించాడు. ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్) టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే ‘గోల్డెన్ స్లామ్’ ఘనతకు అవకాశం లభిస్తుంది. సెప్టెంబర్‌లో జరిగే యూఎస్ ఓపెన్‌లోనూ జొకోవిచ్ చాంపియన్‌గా నిలిస్తే... పురుషుల టెన్నిస్ చరిత్రలో ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు ఒలింపిక్ స్వర్ణం నెగ్గి ‘గోల్డెన్‌స్లామ్’ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు.
Comments
Please login to add a commentAdd a comment