
టోక్యో: టెన్నిస్ ‘టాప్’ స్టార్ నొవాక్ జొకోవిచ్ టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. ‘గోల్డెన్ స్లామ్’ వేటలో ఉన్న ఈ సెర్బియన్ బంగారు పతకానికి రెండే అడుగుల దూరంలో ఉన్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 6–2, 6–0తో స్థానిక స్టార్ కీ నిషికొరి (జపాన్)పై అలవోక విజయం సాధించాడు. టాప్ సీడ్ నొవాక్ క్వార్టర్స్ మ్యాచ్‌ను 70 నిమిషాల్లోనే ముగించాడు. సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జొకోవిచ్ తలపడతాడు. మహిళల విభాగంలో స్విట్జర్లాండ్ స్టార్ బెలిండా బెన్‌చిచ్ సింగిల్స్, డబుల్స్‌లో ఫైనల్ చేరింది. సింగిల్స్ సెమీస్‌లో ఆమె 7–6 (7/2), 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. డబుల్స్‌లో గొలుబిక్–బెన్‌చిచ్ జోడీ 7–5, 6–3తో పిగొసి–స్టెఫానీ (బ్రెజిల్) జంటపై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment