NZ vs Ind: Sanju Samson No Look Six During Practice Session - Sakshi
Sakshi News home page

IND vs NZ: బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌.. శాంసన్‌తో అట్లుంటుంది మరి!

Published Thu, Nov 17 2022 4:51 PM | Last Updated on Thu, Nov 17 2022 5:50 PM

NZ vs IND: Sanju Samsons no look six during practice session  - Sakshi

న్యూజిలాండ్‌తో తొలి టీ20కు టీమిండియా అన్నివిధాలా సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే కివీస్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్‌ నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో సంజూ శాంసన్‌ 'నో లూక్‌' షాట్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కోచింగ్‌ సిబ్బందిలో ఒకరు బౌలింగ్‌ చేయగా.. శాంసన్‌ బంతిని చూడకూండానే భారీ సిక్సర్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో శాంసన్‌తో పాటు రిషబ్‌ పంత్‌, హుడా, అయ్యర్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు కన్పించింది.

ఇక సంజూ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శాంసన్‌ బ్యాటింగ్‌ స్కిల్స్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ఇక నవంబర్‌ 18న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌కు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా ఎంపికయ్యాడు.
టీ20 సిరీస్‌కు భారత జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.


చదవండి: IND vs NZ: 'అతడు అద్భుతమైన బౌలర్‌.. న్యూజిలాండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement