పాకిస్తాన్ జట్టు (PC: PCB)
England tour of Pakistan, 2022 - Pakistan vs England, 1st Test: చారిత్రాత్మక మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన పాకిస్తాన్ బౌలర్ జాహిద్ మొహమ్మద్‌కు చేదు అనుభవం ఎదురైంది. అరంగేట్రంలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రావల్పిండి వేదికగా గురువారం మొదటి టెస్టు ఆరంభమైంది. నిర్జీవమైన పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు వరుగుల వరద పారించి పలు రికార్డులు బద్దలు కొట్టారు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా బాదేసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
ఏకంగా 235 పరుగులు..
ఇక ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాహిద్ పరిస్థితి మరీ ఘోరం. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి మొత్తంగా 33 ఓవర్లు బౌల్ చేసిన 34 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. 7.10 ఎకానమీతో ఏకంగా 235 పరుగులు సమర్పించుకున్నాడు.
అత్యంత చెత్త రికార్డు
తద్వారా శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా అతడి పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా జాహిద్ మొహమ్మద్ నిలిచాడు.ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో జాహిద్ 4 వికెట్లు కూల్చాడు.
ఇంగ్లండ్ సెంచరీ వీరుడు బెన్ డకెట్, జో రూట్, రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక జాహిద్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 3 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో హ్యారీ బ్రూక్ 27 పరుగులు పిండుకుని అతడికి మరో పీడకలను మిగిల్చాడు.
ఇక ఈ జాబితాలో టాప్-5లో ఉన్న వాళ్లు వీరే!
1. జాహిద్ మొహమ్మద్(పాకిస్తాన్)- 2022- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 235 పరుగులు
2. సూరజ్ రాందివ్(శ్రీలంక)- 2010- ఇండియాతో మ్యాచ్‌లో- 222 పరుగులు
3. జేసన్ క్రెజా(ఆస్ట్రేలియా)- 2008- ఇండియాతో మ్యాచ్‌లో- 215 పరుగులు
4. ఒమరి బాంక్స్(వెస్టిండీస్)- 2003- ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో- 204 పరుగులు
5. నీలేశ్ కులకర్ణి(ఇండియా)- 1997- శ్రీలంకతో మ్యాచ్‌లో 195 పరుగులు
చదవండి: Rashid Khan: కెప్టెన్లుగా కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్.. ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన
తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా చరిత్రకెక్కిన హ్యారీ బ్రూక్
Ricky Ponting: రికీ పాంటింగ్‌కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు
Naseem and Saud combine again to take another wicket ☝️
— Pakistan Cricket (@TheRealPCB) December 2, 2022
Harry Brook's fine knock comes to an end. #PAKvENG | #UKSePK pic.twitter.com/mFHywF93Z7
Comments
Please login to add a commentAdd a comment