
ఫొటో కర్టెసీ: న్యూజిలాండ్ క్రికెట్
ఇస్లామాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లకై పాక్‌కు త్వరలోనే పయనం కానుంది. ఈ ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురువారం విడుదల చేసింది. సెప్టెంబరు 17 నుంచి 21 వరకు వన్డే సిరీస్, సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకు టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్ వంటి టాప్ ర్యాంకు జట్టుతో సిరీస్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. 2019 వరల్డ్ కప్ ఫైనలిస్టులు, ఇటీవలే టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన జట్టు, టీ20ల్లో టాప్-3 ర్యాంకు కలిగిన టీంతో పోటీకై స్థానిక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాతో సిరీస్‌కు కివీస్ అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.
కాగా కోవిడ్ నేపథ్యంలో సెప్టెంబరు 11న పాకిస్తాన్ చేరుకోనున్న కివీస్ జట్టు.. 12-14 వరకు రూం ఐసోలేషన్‌లో ఉండి, 15-16 మధ్య ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ మొదలవుతుంది. 2003 నవంబరు తర్వాత న్యూజిలాండ్ పాక్ పర్యటనకు వెళ్లనుండటం ఇదే తొలిసారి. ఇక టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరగనుండటం ఇరు జట్లకు ప్రయోజనకరంగా మారనుంది.
పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్
వన్డే సిరీస్- రావల్పిండిలోనే అన్ని మ్యాచ్‌లు జరుగున్నాయి.
►తొలి వన్డే- సెప్టెంబరు 17
►రెండో వన్డే- సెప్టెంబరు 19
►మూడో వన్డే- సెప్టెంబరు 21
టీ20 సిరీస్- అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లోనే జరుగనున్నాయి.
►తొలి టీ20- సెప్టెంబరు 25
►రెండో టీ20-సెప్టెంబరు 26
►మూడో టీ20- సెప్టెంబరు 29
►నాలుగో టీ20- అక్టోబరు 1
►ఐదో టీ20- అక్టోబరు 3.
#PAKvNZ | The BLACKCAPS will face @TheRealPCB in 8 white ball matches (3 x ODIs, 5 x T20Is) in Pakistan starting in September after the tour to Bangladesh. Details | https://t.co/c7tZum9bQU pic.twitter.com/uGt1ftgGY3
— BLACKCAPS (@BLACKCAPS) August 5, 2021
Comments
Please login to add a commentAdd a comment