పాకిస్తాన్‌ రికార్డు..టాప్‌-6లో మూడు సార్లు భారత్‌ | Pakistan Holds The Record For The Highest Win Percentage In T20I Cricket In A Calendar Year | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ రికార్డు..టాప్‌-6లో మూడు సార్లు భారత్‌

Published Tue, Nov 12 2024 7:23 PM | Last Updated on Tue, Nov 12 2024 8:11 PM

Pakistan Holds The Record For The Highest Win Percentage In T20I Cricket In A Calendar Year

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. దాయాది జట్టు ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో (పొట్టి ఫార్మాట్‌లో) అత్యధిక విజయాల శాతం కలిగిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. పాక్‌ 2018లో 89.47 శాతం విజయాలు సాధించింది. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాల శాతం కలిగిన జట్ల జాబితాలో పాకిస్తాన్‌ తర్వాతి స్థానంలో భారత్‌ ఉంది. 

భారత్‌ టీ20ల్లో ఈ ఏడాది 83.33 శాతం విజయాలు సాధించింది. పాక్‌, భారత్‌ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. టీ20ల్లో ఆస్ట్రేలియా ఈ ఏడాది 77.77 శాతం విజయాలు సాధించింది. టీ20ల్లో అత్యధిక విజయాల శాతం కలిగిన టాప్‌-6 జట్ల జాబితాలో టీమిండియా మూడు స్థానాల్లో నిలిచింది. భారత్‌ రెండు, నాలుగు, ఆరు స్థానాల్లో ఉంది.

ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాల శాతం (టీ20ల్లో) కలిగిన జట్ల జాబితా..

పాకిస్తాన్‌-89.47 (2018)
భారత్‌- 83.33 (2024)
ఆస్ట్రేలియా- 77.77 (2024)
భారత్‌- 73.68 (2018)
ఆఫ్ఘనిస్తాన్‌- 73.33 (2016)
భారత్‌- 71.43 (2016)

కాగా, పాకిస్తాన్‌ జట్టు నవంబర్‌ 14 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటుంది. నవంబర్‌ 14, 16, 18 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు పాక్‌ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడింది. ఇందులో పాక్‌ ఆసీస్‌ను 2-1 తేడాతో ఓడించింది. మరోవైపు భారత్‌ ప్రస్తుతం సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇ‍ప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచాయి. మూడో టీ20 సెంచూరియన్‌ వేదికగా రేపు జరుగనుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement