Pro Kabaddi League: సెమీస్‌లో పింక్‌ పాంథర్స్‌  | Pro Kabaddi League 2024: Jaipur Pink Panthers Beat UP Yoddhas Enters Semi Finals, Check Details Inside - Sakshi
Sakshi News home page

Pro Kabaddi League: సెమీస్‌లో పింక్‌ పాంథర్స్‌.. ఆ జట్టు కూడా!

Published Tue, Feb 13 2024 9:29 AM | Last Updated on Tue, Feb 13 2024 10:19 AM

PKL 10: Jaipur Pink Panthers Beat UP Yoddhas Enters Semi Finals - Sakshi

సెమీస్‌లో పింక్‌ పాంథర్స్‌ (PC: ProKabaddi X)

Pro Kabaddi League 10-కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. యూపీ యోధాస్‌తో జరిగిన మ్యాచ్‌లో పింక్‌ పాంథర్స్‌ 67–30తో గెలిచింది. జైపూర్‌ ప్లేయర్‌ అర్జున్‌ 20 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ గెలుపుతో పింక్‌ పాంథర్స్‌ 82 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లోకి రాగా... పుణేరి పల్టన్‌ 81 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు టాప్‌–2లో నిలవనున్నాయి. దాంతో ఈ రెండు జట్లకు సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 46–34తో యు ముంబాను ఓడించింది.  

చదవండి: Paris olympics: బ్రెజిల్‌కు బిగ్‌ షాక్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్జెంటీనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement