ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా (Photo Credit: SAI Twitter)
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ స్వర్ణం గెలిచింది. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ కెనడాకు చెందిన బాక్సర్ స్కార్లెట్ సవన్నాహ్‌పై సునాయాసంగా గెలుపొందింది. తొలి బౌట్ నుంచి ప్రీతి పవార్ ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. ఇక రెండో బౌట్‌లోనూ ప్రీతి తన ప్రత్యర్థి ముఖంపై పంచుల వర్షం కురిపించి ఆధిక్యంలో నిలిచింది.
ఇక మూడో బౌట్‌లోనూ తనదైన శైలిలో విరుచుకుపడ్డ ప్రీతి పవార్‌ను న్యాయ నిర్ణేతలు యునానిమస్ విజయం సాధించినట్లు ప్రకటించారు. కాగా ఈసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బాక్సింగ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. ఇప్పటికే బాక్సింగ్ విభాగం నుంచి కనీసం 10 పతకాలు ఖాయమైన సంగతి తెలిసిందే. ప్రీతి సాధించిన స్వర్ణం భారత్‌కు 6వ స్వర్ణం కాగా, ఓవరాల్‌గా 24వ పతకం.
👉ఇక మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా కూడా స్వర్ణం కైవసం చేసుకుంది. ఫైనల్లో జాస్మిన్ ఐర్లాండ్‌కు చెందిన మికెలియాను చిత్తు చేసి పసిడి పతకం సాధించింది. కామన్‌వెల్త్‌లో భారత్‌కు ఇది ఏడో స్వర్ణం కాగా, ఓవరాల్‌గా 25వ పతకం.
JAISMINE LAMBORIA IS BOXING 57KG COMMONWEALTH GAMES CHAMPION 🇮🇳🥇
- She defeated Northern Ireland’s boxer via unanimous decision 5:0 in the Finals
TOTAL DOMINATING WIN! 🔥🔥🔥 pic.twitter.com/fgu6Nt0jCG— The Khel India (@TheKhelIndia) August 1, 2026
👉ఇక పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 27కు చేరుకుంది. ఇందులో 7 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.
SELVA PRABHU WINS THE BRONZE MEDAL FOR INDIA IN TRIPLE JUMP! 🥉
- 27th Medal for India at CWG 2026 pic.twitter.com/2Y2AjToipA— The Khel India (@TheKhelIndia) August 1, 2026
PRAVEEN CHITRAVEL WINS THE SILVER FOR INDIA IN TRIPLE JUMP! 🥈
- 26th Medal for India at CWG 2026 pic.twitter.com/wbnXWA02DB— The Khel India (@TheKhelIndia) August 1, 2026


