Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూ్స్ అందింది. జ్వరంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన యువ ఓపెనర్ పృథ్వీ షా కోలుకున్నాడు. దీంతో అతడు సోమవారం(మే16) పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే ఢిల్లీ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఈ ఏడాది సీజన్‌లో పృథ్వీ షా ఓపెనర్‌గా ఢిల్లీకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. షా గత మూడు మ్యాచ్‌లకు దూరం కావడంతో ఢిల్లీకు సరైన ఆరంభం లభించడంలేదు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రీకర్ భరత్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఇక ఈ సీజన్‌లో పృథ్వీ షా 9 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 259 పరుగులు చేశాడు.
చదవండి: తూచ్.. రిటైర్ కావట్లేదు..! రిటైర్మెంట్ ట్వీట్‌ను డిలీట్ చేసిన అంబటి రాయుడు
Comments
Please login to add a commentAdd a comment