డ్రమ్మోయ్నీ ఓవల్(సిడ్నీ): ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు ఓపెనర్ పృథ్వీ షా బ్యాటింగ్‌లో డకౌటైన సంగతి తెలిసిందే. కాగా, ఫీల్డింగ్‌లో మాత్రం పృథ్వీ షా అద్భుతమైన క్యాచ్‌తో మరిపించాడు. సోమవారం రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ టిమ్ పైన్(44) ఆడిన ఒక షాట్‌ను పృథ్వీ షా క్యాచ్‌గా తీసుకుని శభాష్ అనిపించాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 59 ఓవర్ ఐదో బంతిని షార్ట్ పిచ్ బాల్‌గా సంధించాడు. దాన్ని పుల్ చేయగా అది సరిగా మిడిల్ కాలేదు. అదే సమయంలో స్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షా.. బంతిని ఒక్కో చేత్తో అందుకున్నాడు. బంతి తలపై నుంచి వెళుతుండగా కచ్చితమై టైమింగ్‌తో ఆ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దాంతో 104 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. (ధావన్.. నేను ధోనిని కాదు: వేడ్)
ఈ మ్యాచ్‌లో ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(114 బ్యాటింగ్), మార్క్ స్టీకెట్(1 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. భారత ‘ఎ’ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, సిరాజ్, అశ్విన్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి. అంతకుముందు భారత్ జట్టు 247/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. రహానే(117నాటౌట్) సెంచరీ సాధించాడు. టాస్ గెలిచిన భారత ‘ఎ’ జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దీంతో రహానే నేతృత్వంలోని భారత బ్యాటింగ్‌ను పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్‌లు ఆరంభించారు. వీరిద్దరూ డకౌట్లుగా వెనుదిరగడంతో భారత ’ఎ’ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరుణంలో చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పుజారా 140 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. అనంతరం రహానే సెంచరీతో మెరిశాడు.(సెకండ్ చాన్స్ ఇవ్వని కోహ్లి..!)
Good catch by Shaw!
— cricket.com.au (@cricketcomau) December 7, 2020
Paine's gotta go for 44 after a century stand with Green. Watch #AUSAvIND live: https://t.co/MfBZAvzAkr pic.twitter.com/yvhTgS1IvE
Comments
Please login to add a commentAdd a comment