SL Vs SA T20 2021: Quinton De Kock Innings Help South Africa White Wash Sri Lanka T20 Series - Sakshi
Sakshi News home page

SL Vs SA: డికాక్‌ మెరుపులు.. 10 వికెట్లతో విజయం; దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌

Published Wed, Sep 15 2021 7:29 AM | Last Updated on Wed, Sep 15 2021 12:05 PM

Quinton De Kock Innings Help South Africa White Wash Sri Lanka T20 Series - Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టి20లో దక్షిణాఫ్రికా 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దాంతో సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు), చమిక కరుణరత్నే (19 బంతుల్లో 24 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. జార్న్‌ ఫోర్చూన్, రబడ చెరో రెండు వికెట్లు తీశారు.

చదవండి: అక్టోబర్ 17న రెండు ఐపీఎల్‌ కొత్త జట్లకు వేలం?

ఛేదనలో సఫారీ జట్టు 14.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 121 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు డికాక్‌ (46 బంతుల్లో 59 నాటౌట్‌; 7 ఫోర్లు), రీజా హెండ్రిక్స్‌ (42 బంతుల్లో 56 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయమైన తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును డికాక్‌ అందుకున్నాడు.

చదవండి: నాడు కవ్వించిన కోహ్లి, బ్యాట్‌తో జవాబిచ్చి.. టాప్‌-5 ఇన్నింగ్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement