![Quinton de Kock sets Twitter ablaze with record-shattering century against KKR - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/18/quenon.jpg.webp?itok=tCnWyUvJ)
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు డికాక్ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. ఇక డికాక్‌కు ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీ.
2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తన తొలి సెంచరీను డికాక్ నమోదు చేశాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన మూడో ఆటగాడిగా డికాక్ నిలిచాడు. అంతకు ముందు క్రిస్ గేల్(175), బ్రెండన్ మెకల్లమ్(158) పరుగులు సాధించారు. ఇక సునామీ ఇన్నింగ్స్ ఆడిన డికాక్‌పై ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.
చదవండి: IPL 2022: చరిత్ర సృష్టించిన లక్నో ఓపెనర్లు..ఐపీఎల్‌లో తొలిసారి..!
Comments
Please login to add a commentAdd a comment