ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు ఆదృష్టం కలిసొచ్చింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి రాహుల్ తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే యశస్వీ జైశ్వాల్‌ను మిచిల్ స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు.
దీంతో మరో ఓపెనర్‌గా ఉన్న రాహుల్ కాస్త ఆచితూచి ఆడాడు. మొదటి 6 ఓవర్లలో 18 బంతులు ఆడి తన ఖాతా తెరవడానికి కష్టపడ్డాడు. ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. తమ స్టార్ పేసర్ స్కాట్ బోలాండ్‌ను ఎటాక్‌లో తీసుకొచ్చాడు.
ఒకే ఓవర్‌లో రెండు ఛాన్స్‌లు..
భారత ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన బోలాండ్ తొలి బంతిని రాహుల్‌కు వైడ్ ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని రాహుల్ బ్యాక్ ఫుట్‌లో డిఫెండ్ ఆడాడు. అయితే రాహుల్ మూమెంట్ కాస్త స్లోగా ఉండడంతో బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది.
దీంతో బౌలర్‌తో పాటు ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్‌కు అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. అంపైర్ ఔట్ ఇవ్వకముందే రాహుల్ మైదానాన్ని వీడేందుకు సిద్దమయ్యాడు. కానీ ఇక్కడే అస్సులు ట్విస్ట్ చోటు చేసుకుంది. బౌలర్ బోలాండ్ ఓవర్ స్టప్ చేయడంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో కేఎల్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకనట్లు తేలడం గమనార్హం.
అనంతరం అదే ఓవర్‌లో రాహుల్‌కు మరో లైఫ్ వచ్చింది. స్లిప్‌లో రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను ఖవాజా జారవిడిచాడు. అయితే తనకు వచ్చిన అవకాశాలను రాహుల్ అందిపుచ్చుకోలేకపోయాడు. ఆఖరికి 37 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
చదవండి: ఆ రోజు జైశ్వాల్ ఏమన్నాడో వినలేదు.. కానీ అతడికి అస్సలు భయం లేదు: స్టార్క్
— Sunil Gavaskar (@gavaskar_theman) December 6, 2024
Comments
Please login to add a commentAdd a comment