ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివిధ లీగుల్లో తమ ఫ్రాంచైజీకే నాలుగేళ్లు ఆడేందుకు రూ. 40 కోట్ల భారీ మొత్తాన్ని రాజస్తాన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. రాజస్తాన్ ఆఫర్ పై బట్లర్ కూడా ఆలోచనలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లగా రాజస్తాన్ రాయల్స్‌కు బట్లర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు రూ.10 కోట్లకు బట్లర్‌ను రాజస్తాన్ రీటైన్ చేసుకుంది. అదే విధంగా బట్లర్ ఐపీఎల్‌తో పాటు దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్‌ఎ టీ20 లీగ్ లో రాజస్తాన్ యాజమాన్యం కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం బార్బోడస్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అమెరికాలో జరగబోయే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసే ఆలోచనలో రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే బట్లర్‌కు ఈ క్రేజీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఆఫర్‌ను బట్లర్ అంగీకరించనట్లయితే ఇంగ్లండ్ క్రికెట్‌తో తన కాంట్రాక్ట్‌ను వదులుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా ఇలాంటి ఒక ఆఫర్‌ను ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్చర్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ డీల్ కనుక ఒప్పుకుంటే.. ఐఎల్‌టీ20, ఎంఎల్‌సీ వంటి లీగ్స్‌లో కూడా ముంబై ఫ్రాంచైజీ తరఫున ఆడాల్సి ఉంటుంది.
చదవండి: World Cup 2023: టీమిండియాకు బిగ్‌షాక్.. వరల్డ్‌కప్‌కు స్టార్ ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment