నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి | Ravi Shastri Urges AB De Villiers To Come Out Of Retirement | Sakshi
Sakshi News home page

నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి

Published Tue, Oct 13 2020 5:29 PM | Last Updated on Tue, Oct 13 2020 5:30 PM

Ravi Shastri Urges AB De Villiers To Come Out Of Retirement - Sakshi

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 82 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో  ఏబీ డివిలియర్స్‌ కీలక పాత్ర పోషించింది. ఏబీడీ 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో  మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓవర్‌ ఓవర్‌కు స్కోరు బోర్డులో అంచనాను సైతం తారుమారు చేస్తూ చెలరేగిపోయాడు. నిన్నటి డివిలియర్స్‌పై టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అసలు ఈ ఇన్నింగ్స్‌ నమ్మశక్యంగా లేదని కొనియాడాడు.  రాత్రి మ్యాచ్‌ చూసిన తర్వాత, ప్రొద్దుటే లేచిన తర్వాత కూడా ఏబీడీ ఇన్నింగ్స్‌  గుర్తుకొస్తోంది.  ఆర్సీబీ  గెలిచిన నిన్నటి మ్యాచ్‌ డివిలియర్స్‌ అంతర్జాతీయ రీఎంట్రీ అవసరం ఉందని తెలుపుతోంది. నువ్వు.. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకో. ఆట మంచిదే. నీ రీఎంట్రీకి ఇది చాలు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.(కోహ్లి.. ఇది ఓవరాక్షన్‌ కాదా?)

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు  ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌లో ఛేదించే క్రమంలో కేకేఆర్‌ పూర్తిగా తేలిపోయింది. శుబ్‌మన్‌ గిల్‌(34; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) మినహా ఎవరూ రాణించలేదు. కేకేఆర్‌ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ముందుగా బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆర్సీబీ..అటు తర్వాత బౌలింగ్‌లోనూ విశేషంగా రాణించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement