చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన సొంతమైదానంలో బంగ్లా బౌలర్లను అశ్విన్ ఊచకోత కోశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశూ.. అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
అశ్విన్ తన బ్యాటింగ్ శైలికి భిన్నంగా దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. అప్పటివరకు భారత్‌కు చుక్కలు చూపించిన బంగ్లా పేసర్లపై అశ్విన్ ఎదురుదాడికి దిగాడు. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టుస్తున్నాడు.
ఈ క్రమంలో కేవలం 108 బంతుల్లోనే తన ఆరో టెస్టు సెంచరీని అశూ అందుకున్నాడు. అశ్విన్ 112 బంతుల్లో 102 పరుగులు చేసి క్రీజులో ఆజేయంగా ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.
భారీ స్కోర్ దిశగా భారత్..
తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్‌తో పాటు జడేజా(86) పరుగులతో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టగా.. నహిద్ రానా, మెహదీ హసన్ మీరజ్ తలా రెండు వికెట్లు సాధించారు.
Hometown Hundred for Ravichandran Ashwin! 💯 👌#INDvBAN #JioCinema #IDFCFirstBankTestSeries pic.twitter.com/i27n47VK1v
— JioCinema (@JioCinema) September 19, 2024
Comments
Please login to add a commentAdd a comment