టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టిన ఎలైట్ బౌలర్ల జాబితాలో జడేజా చేరాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఖవాజాను ఔట్ చేసిన జడ్డూ.. ఈ ఫీట్ నమోదు చేశాడు. దీంతో పాటు మరిన్ని రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు.
టెస్టుల్లో 250 వికెట్ల మార్కును అందుకున్న ఎనిమిదో భారత బౌలర్‌గా జడ్డూ నిలిచాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే, అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, బిషన్ సింగ్ బేడీ ఉన్నారు.
అదే విధంగా.. టెస్టుల్లో 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా జడ్డూ నిలిచాడు. ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, అశ్విన్, కపిల్ దేవ్ జడ్డూ కంటే ముందున్నారు.
తొలి భారత క్రికెటర్‌గా..
ఇక టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా జడేజా నిలిచాడు. జడేజా 62 టెస్టుల్లోనే ఈ ఫీట్ నమోదు చేశాడు.
అయితే, ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ ఉన్నాడు. బోథమ్ ఈ రికార్డును కేవలం 55 టెస్టుల్లోనే సాధించడం విశేషం.
చదవండి: IND Vs AUS: పాపం వార్నర్.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్
A much-needed breakthrough for #TeamIndia! @iamjadeja breaks a building partnership. Khawaja departs!💪🏽
— Star Sports (@StarSportsIndia) February 17, 2023
Tune-in to the action in the Mastercard #INDvAUS Test on Star Sports & Disney+Hotstar!#BelieveInBlue #TestByFire pic.twitter.com/RfXFtd7roR
Comments
Please login to add a commentAdd a comment