PC: IPLcom
ఐపీఎల్-2022లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో సీఎస్‌కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సీఎస్‌కే విజయానికి అఖరి 4 బంతుల్లో 16 పరుగులు అవసరమవగా మహేంద్రసింగ్ ధోనీ వరుసగా 6, 4, 2, 4 బాది జట్టును గెలిపించాడు. ఇక తన స్టైల్లో మ్యాచ్‌ను ఫినిష్ చేసి డగౌట్‌కి తిరిగొస్తున్న ధోనీకి విజయోత్సవంలో ఉన్న కెప్టెన్ జడేజా ఎదురెళ్లి.. క్యాప్ తీసేసి వంగి మరీ ధోనీకి నమస్కరించాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రాయుడు(40), రాబిన్ ఊతప్ప(30) పరుగులతో రాణించగా.. అఖరిలో ధోని ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
చదవండి: IPL 2022: రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్!
Hats off #THA7A! 💛😍pic.twitter.com/CJE07pERse#MIvCSK #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2022
Comments
Please login to add a commentAdd a comment