Ravindra Jadeja Claims 7 Wicket Innings Haul In 2nd Test Against Australia - Sakshi
Sakshi News home page

IND Vs AUS: 7 వికెట్లతో చెలరేగిన జడేజా.. కెరీర్‌ బెస్ట్‌ ఇదే!

Published Sun, Feb 19 2023 11:33 AM | Last Updated on Sun, Feb 19 2023 1:03 PM

Ravindra Jadeja claims 7 wickets in 2nd test agianst australia - Sakshi

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా.. ఇప్పుడు ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో కూడా దుమ్మురేపాడు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో జడేజా చెలరేగాడు. కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్ల పడగొట్టిన జడ్డూ.. తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

ఇంతకుముందు 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో జడేజా 48 పరుగులిచ్చి 7 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో జడ్డూ తన గత బెస్ట్‌ను అధిగమించాడు. ఇక ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా జడేజా రాణించాడు. మూడు వికెట్లతో పాటు.. బ్యాటింగ్‌లో కూడా 26 పరుగులు చేశాడు.

ఇక ఓవరాల్‌గా ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి జడేజా 10 వికెట్లు పడగొట్టాడు. కాగా రవీంద్ర జడేజా స్పిన్‌ మ్యాజిక్‌కు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. జడేజాతో పాటు అశ్విన్‌ కూడా మూడు వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన ఒక్క పరుగు అధిక్యంతో కలిపి భారత్‌ ముందు కేవలం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 
చదవండి: Ind Vs Aus 2nd Test Updates: రవీంద్ర జడేజా మ్యాజిక్‌.. 113 పరుగులకే కుప్పకూలిన ఆసీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement