Ravindra Jadeja Wife Rivaba Reacts To His Controversial Post Amid Spat With MS Dhoni - Sakshi
Sakshi News home page

IPL 2023: జడ్డూ-ధోని మధ్య విభేదాలు.. మధ్యలో రవీంద్ర జడేజా భార్య..!

Published Mon, May 22 2023 4:47 PM | Last Updated on Mon, May 22 2023 5:05 PM

Ravindra Jadeja Wife Tweet Goes Viral Amid His Husband And MS Dhoni Spat - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, అతని ప్రియ శిష్యుడిగా పేరొందిన రవీంద్ర జడేజా మధ్య విభేదాలు మొదలయ్యాయని క్రికెట్‌ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అద్భుతంగా రాణిస్తూ, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో 3 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు దక్కించుకున్నా ధోని కారణంగా తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కట్లేదని జడేజా అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. 

రెండు రోజుల క్రితం వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మే 20న ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయానంతరం ధోని-జడేజా మధ్య వాగ్వాదం జరిగినట్లు లైవ్‌లో స్పష్టంగా కనిపించింది. డీసీపై గెలిచి ప్లే ఆఫ్స్‌ రెండో బెర్తు ఖరారైన అనంతరం, ఆటగాళ్లు ఒకరినొకరు అభినందించుకుంటుండగా జడేజాపై ధోని కోప్పడుతున్నట్లు టీవీల్లో స్పష్టంగా కనబడింది. 

అదే సమయంలో జడ్డూ ధోనిపై ఉన్న కోపాన్ని తన ముఖంలో చూపించడం మనం గమనించాం. ఆ మ్యాచ్‌లో జడేజా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడమే జడేజాపై ధోని విరుచుకుపడటానికి కారణమని కొందరు అనుకున్నారు. అయితే వారి మధ్య విభేదాలకు కారణం వేరని ఇంకొందరు చెబుతున్నారు. 

సీఎస్‌కే అభిమానులు జడేజాను అస్సలు ఇష్టపడట్లేదని, అతను త్వరగా ఔటవ్వాలని కోరుకుంటున్నారని వారంటున్నారు. ధోనిపై ఎంత ఇష్టం ఉన్నా ఇలా ప్రవర్తించడం జడేజా అస్సలు రుచించట్లేదని, సొంత అభిమానుల చేతిలో ఈ రకంగా అవమానపడటం కంటే అగౌరవం ఏముంటుందని జడేజా బహిరంగంగా వాపోయినట్లు చెబుతున్నారు.

ఈ ప్రచారం జరుగుతున్న సమయంలోనే డీసీపై విజయానంతరం జడేజా ఓ వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. "కర్మ మన వద్దకు తిరిగి వస్తుంది, అది రావడం కాస్త లేటవుతుందేమో కానీ, తప్పక వస్తుంది" అంటూ ట్వీట్‌ చేస్తూ థంప్స్‌ అప్‌ ఐకాన్‌తో పాటు ఖచ్చితంగా అని క్యాప్షన్‌ జోడించాడు. 

జడ్డూ ఈ ట్వీట్‌ చేసిన గంటల వ్యవధిలోనే అతని భార్య రివాబా రీట్వీట్‌ చేస్తూ.. నీ దారిలో నువ్వు వెళ్లు అంటూ చేతులు జోడించిన ఐకా​న్‌తో కామెంట్‌ చేసింది. రివాబా చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చినీయాంశంగా మారింది. జడేజా-ధోని మధ్య నిజంగా ఏదో జరుగుతుందని.. అతని భార్య కూడా జోక్యం చేసుకునే స్థాయికి వారి మధ్య విభేదాలు పెరిగాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  

చదవండి: ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలుకొట్టిన ఐపీఎల్‌ 2023.. ఇంకా 4 మ్యాచ్‌లు ఉండగానే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement