photo credit: IPL Twitter
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. నిన్న (ఏప్రిల్ 26) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఈ పరాభవాన్ని ఎదుర్కొంది. ఆర్సీబీ బౌలర్లు కేకేఆర్‌ను 200 పరుగులు చేయనివ్వడంతో ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 అంతకంటే ఎక్కువ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా రికార్డుల్లోకెక్కింది.
ఆర్సీబీ ఇప్పటివరకు 24 సార్లు ప్రత్యర్ధులను 200 ప్లస్ స్కోర్ చేయనివ్వగా.. పంజాబ్ 23, కేకేఆర్ 18, సీఎస్‌కే 17, ఢిల్లీ 16,రాజస్థాన్ 14, సన్‌రైజర్స్ 14, ముంబై 11 సందర్భాల్లో ప్రత్యర్ధులను 200 కంటే అధికమైన స్కోర్ చేయనిచ్చాయి.
చదవండి: అవమాన భారంతో తలెత్తుకోలేకపోతున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. డీకే, షాబాజ్‌పై ఫైర్
కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు డేవిడ్ విల్లే (3-0-31-0), షాబాజ్ అహ్మద్ (1-0-25-0), విజయ్ కుమార్ వైశాఖ్ (4-0-41-2), హర్షల్ పటేల్ (4-0-44-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నితీశ్ రాణా (21 బంతుల్లో 48), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31) చెలరేగి ఆడారు. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (37 బంతుల్లో 54) మినహాయించి అందరూ విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 179 పరుగులు (8 వికెట్ల నష్టానికి) మాత్రమే చేసి, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వరుణ్ చక్రవర్తి 3, సుయాశ్ శర్మ, ఆండ్రీ రసెల్ తలో 2 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించారు.
Comments
Please login to add a commentAdd a comment