ఆసియా కప్-2022కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. బుమ్రా చివరగా ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా.. వెన్ను నొప్పి కారణంగా అఖరి వన్డేకు దూరమయ్యాడు.
ఇక ఇంగ్లండ్ పర్యటన అనంతరం విండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కు బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. కాగా బుమ్రా ఇంకా వెన్ను గాయం నుంచి కోలుకోలేనట్లు తెలుస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్-2022 కు ముందు బుమ్రాను ఆడించి రిస్క్ తీసుకోడదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌కు బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
"జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఆసియా కప్‌లో భాగం కావడం కష్టమనే చెప్పుకోవాలి. అతడు మా జట్టు ప్రధాన బౌలర్. బుమ్రాను టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆడించి ఎటువంటి రిస్క్ తీసుకోడదని నిర్ణయించుకున్నాం. కాబట్టి అతడిని ఆసియా కప్‌లో ఆడించేందుకు మేము సిద్దగా లేము. ఎందుకంటే అతడి గాయం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది" బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు. ఇక ఆసియా కప్ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది.
చదవండి: Nepal Head Coach: నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..
Comments
Please login to add a commentAdd a comment