దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తొలిసారి ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ దక్కించుకున్నాడు. జనవరి నెలకుగాను ఇచ్చిన అవార్డును పంత్ సొంతం చేసుకున్నాడు.తీ క్రమంలో అతడు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్‌లను వెనక్కి నెట్టాడు. జనవరిలో ఆసీస్‌తో జరిగిన చివరి టెస్టులో రిషబ్ పంత్ టీమిండియా చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
బ్రిస్బేన్ టెస్ట్‌లో 89 పరుగులు చేసిన పంత్.. టీమ్‌కు అద్వితీయమైన విజయాన్ని సాధించి పెట్టాడు. అంతకుముందు సిడ్నీ టెస్ట్‌లోనూ 97 పరుగులు చేసిన పంత్.. ఆ మ్యాచ్ డ్రాగా ముగియడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ రెండు టెస్టుల్లోనూ క్లిష్టమైన పరిస్థితుల్లో పంత్ ఆడిన తీరు అద్భుతమని ఐసీసీ కొనియాడింది. ఇక వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును షబ్నిమ్ ఇస్మాయిల్ దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మహిళా క్రికెటర్‌కు జనవరి నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది.
ఇక్కడ చదవండి: ఇషాంత్ శర్మ కెరీర్‌లో మరో మైలురాయి
Comments
Please login to add a commentAdd a comment