![Rishabh Pant Will Lead Delhi Capitals To Their Maiden Title Win This Year Says Khaleel Ahmed - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/31/k-ahmad.jpg.webp?itok=So7dxdbo)
PC: BCCI Twitter
ఐపీఎల్-2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి టైటిల్‌ను ముద్దాడుతుంది అని ఆ జట్టు పేసర్ ఖలీల్ అహ్మద్ థీమా వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి టైటిల్‌ను అందించే సత్తా కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఉందని ఆహ్మద్ తెలిపాడు. గత నాలుగు సీజన్‌లలో సన్‌రైజెర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన ఖలీల్ అహ్మద్ ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్నాడు.
ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా రూ. 5.25 కోట్లకు అతడిని ఢిల్లీ క్యాపిటిల్స్ కొనుగోలు చేసింది. ఇక 2016 అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఖలీల్ అహ్మద్, పంత్ ప్రాతినిధ్యం వహించారు. కాగా అఖరి మూడు సీజన్‌లలో ప్లేఆప్స్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్‌ను అందుకోలేకపోయింది. ఇక తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి ఐపీఎల్-2022ను ఢిల్లీ ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ 27 పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు.
"రిషబ్ పంత్ వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు. అతడు నేను ఒకే సమయంలో మా కెరీర్‌ను ప్రారంభించాము. మేమిద్దరం భారత్ అండర్-19 జట్టు తరుపున ఆడాము. మన కెప్టెన్ గురుంచి మనకు తెలిసినప్పడు, అతనితో మన ప్లాన్స్‌ను చర్చించవచ్చు. మళ్లీ పంత్‌తో కలిసి ఆడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి తమ తొలి టైటిల్‌ను గెలిచుకుంటుందనే నమ్మకం నాకు ఉంది. రిషబ్ అద్భుతమైన కెప్టెన్. కాబట్టి ఢిల్లీకు కచ్చితంగా పంత్ తొలి టైటిల్‌ను అందిస్తాడు అని నేను భావిస్తున్నాను "అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌న్యూస్.. సిక్సర్ల వీరుడు వచ్చేశాడు!
Comments
Please login to add a commentAdd a comment