హండ్రెడ్‌లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జ‌ట్టుకు విజ‌యం | Rodrigues Unbeaten-42-Runs-Guide Southern Brave-5-Wkt-Victory Vs Sunrisers | Sakshi
Sakshi News home page

Hundred Women's 2026: హండ్రెడ్‌లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జ‌ట్టుకు విజ‌యం

Jul 26 2026 8:42 AM | Updated on Jul 26 2026 10:30 AM

Rodrigues Unbeaten-42-Runs-Guide Southern Brave-5-Wkt-Victory Vs Sunrisers

Photo Credit: Hundred Twitter

హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీష‌న్‌లో భార‌త బ్యాట‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. తాజాగా సద‌ర‌న్ బ్రేవ్ జ‌ట్టు ప్లేయ‌ర్ జేమిమా రోడ్రిగ్స్ అజేయ ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో జ‌ట్టును గెలిపించింది. విష‌యంలోకి వెళితే శనివారం డ‌బుల్ హెడ‌ర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్‌, స‌ద‌ర‌న్ బ్రేవ్స్ త‌ల‌ప‌డ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ 100 బంతుల్లో 116 ప‌రుగులకు ఆలౌటైంది. 

ఓపెన‌ర్ బ్రియాని స్మిత్ (48), అనాబెల్ స‌ద‌ర్లాండ్ (22), దీప్తి శ‌ర్మ (23) రాణించారు. స‌ద‌ర‌న్ బ్రేవ్ బౌల‌ర్ల‌లో ఇస్సీ వాంగ్ మూడు వికెట్లు తీయ‌గా, టిల్లీ కొలెమ‌న్ 2 వికెట్లు ప‌డ‌గొట్టింది. అనంత‌రం స‌ద‌ర‌న్ బ్రేవ్స్ 96 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 117 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. 

జేమిమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 42 నాటౌట్‌, 4 ఫోర్లు) చివ‌రి వ‌ర‌కు నిలిచి జ‌ట్టును గెలిపించింది. స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ బౌల‌ర్ల‌లో కాసిడి మెక్‌కార్తీ 2 వికెట్లు తీయ‌గా, జెస్ జొనాసన్‌, అనాబెల్ స‌ద‌ర్లాండ్‌, డానియెల్లె గిబ్స‌న్ త‌లా ఒక వికెట్ తీశారు. 

మ‌రో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ లండ‌న్‌పై వెల్ష్ ఫైర్ జ‌ట్టు 60 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ వుమెన్స్ 100 బంతుల్లో 4 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. సోఫి డివైన్ (52) అర్ధ‌సెంచ‌రీ సాధించ‌గా, జార్జియా వోల్ (42), జార్జియా వ‌ర్హెమ్ (43 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. 

అనంత‌రం ఛేద‌న‌లో ముంబై ఇండియన్స్‌ లండ‌న్ 92 బంతుల్లో 117 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. చినెల్లి హెన్రీ (30) టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. గ్రేస్ పాట్స్ 3 వికెట్లు ప‌డగొట్టింది.

 

చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్‌.. గంభీర్ రాజీమానాకు డిమాండ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement