వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కరీబియన్ గడ్డపై అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, మహ్మద్ సిరాజ్‌తో కూడిన మొదటి బ్యాచ్ వెస్టిండీస్‌కు చేరుకుంది.
తాజాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ విండీస్ దీవుల్లో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రోహిత్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరోవైపు లండన్‌లలో చక్కర్లు కొడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఒకట్రెండు రోజుల్లో విండీస్‌కు చేరుకోనున్నాడు.
ఇక ఈ సిరీస్‌లో భాగంగా టీమిండియా అతిథ్య విండీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 12 నుంచి డొమెనికా వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇక టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు బార్బడోస్ వేదికగా టీమిండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.
వెస్టిండీస్‌తో టెస్టు 'సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
వెస్టిండీస్ సన్నాహక జట్టు:
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.
చదవండి: WC 2023: ఇంతకంటే దిగజారడం ఉండదు: విండీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment