
రోహిత్ శర్మ.. ఈ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం తొమ్మిది నెలల వ్యవదిలోనే భారత జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన లీడర్ అతడు. రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడింది.
న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. మూడో సారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఈ విజయంతో పాతికేళ్ల కిందట కివీస్ చేతిలో పరాభావానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో యావత్తు దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రధాని నుంచి సామన్య మానవుడి వరకు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మది కీలకపాత్ర. రోహిత్ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్.. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..
👉ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ జట్టు కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.
👉అదేవిధంగా భారత్‌కు అత్యధిక ఐసీసీ టైటిల్స్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011, ఛాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది. ధోని మొత్తంగా భారత్‌కు మూడు టైటిల్స్‌ను అందించగా.. రోహిత్ రెండు టైటిల్స్‌ను సాధించాడు.
👉పరిమిత ఓవర్ల ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విన్నింగ్ శాతం కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వైట్‌బాల్ ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కు చేరింది. చివరి మూడు టోర్నమెంట్లలో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది.
అది కూడా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ఆ తర్వాత రెండు టోర్నీలను టీమిండియా ఆజేయంగా ముగించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజి 90 శాతంగా ఉంది. రోహిత్ తర్వాతి స్ధానాల్లొ పాంటింగ్(88 శాతం), గంగూలీ(80శాతం) ఉన్నారు.
చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment